రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Indiramma Indlu పథకం మొదటి విడత చివరి దశకు చేరుకుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దాదాపుగా ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరైన గ్రామాలు తప్ప మిగతా గ్రామాల లబ్ధిదారుల తుది జాబితా ఆయా జిల్లాల కలెక్టర్ గారి అనుమతి పొందే దశలో ఉన్నాయి.
ఏఐ ఎక్సెప్షన్ అనే ఆప్షన్ తో 70 శాతం లబ్ధిదారులు అవుట్
అయితే తాజాగా మొదటి దశ లబ్ధిదారుల ఫిల్టరైజేషన్ను ఏఐ ద్వారా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న లబ్ధిదారులను మరియు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా ఇంటిముందు క్యాప్చర్ అయిన ఫోటోలో ఇల్లు నిర్మించే స్థలం సరిగ్గా లేకపోయినా, లబ్ధిదారులకు రేషన్ కార్డు లేకపోయినా, మరియు ఆ ఇల్లు నివాసయోగ్యం కాదని అనే ఆప్షన్ లతో ఏఐ లబ్ధిదారులు అనర్హులు గా తేల్చి చెప్పింది. దీంతో తుది జాబితా లబ్ధిదారుల్లో సగానికి సగం మంది అనర్హులుగా అవనున్నారు.
రేవంత్ సర్కార్ తుది జాబితా లబ్ధిదారుల అందరికీ Indiramma Illu మంజూరు చేస్తుందా లేదా ఏఐ ఫిల్టరైజేషన్లో భాగంగా అనర్హులుగా తేలిన లబ్ధిదారులను తీసివేసి మిగతా వారికి ఇల్లు మంజూరు చేస్తుందో చూడాలి.
ఏంటి ఈ ఏఐ ఫిల్టరైజేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మొదటి విడత తుది జాబితా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. అయితే ఈ జాబితాను ఏఐతో అనుసంధానం చేసి ఫిల్టర్ చేశారు. దీనివలన పైన చెప్పినటువంటి అంశాలలో లబ్ధిదారులు ఉంటే వారిని అనర్హులుగా ఏఐ గుర్తిస్తుంది. దీనివలన 60 నుంచి 70 శాతం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అనర్హులుగా అవనున్నారు.