రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు షాక్! ఈ స్కోర్ లేకపోతే రుణం లేదు!

Rajiv Yuva Vikasam పథకంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుతో యువతకు ఆర్థిక సాయం ఇచ్చే ప్రక్రియలో లబ్ధిదారుల సిబిల్ స్కోర్ చెక్ చేసే ప్రక్రియ ను బ్యాంక్ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పూర్తి చేశారు. CIBIL Score Check ప్రక్రియ లో బాగంగా లబ్ధిదారుల క్రెడిట్ హిస్టరీని చెక్ చేయడం అవసరం అయింది. లబ్ధిదారులు ఎవరైతే 200 నుండి 700 లోపు సిబిల్ స్కోర్ కలిగివున్నారో వాళ్ళు ఈ పధకానికి అనర్హులుగా అవనున్నారు. 700 పైన సిబిల్ స్కోర్ వున్న లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు.

ఈ ప్రక్రియ లో బాగంగా ఎవరైతే ఇంతకు ముందు ఏదేని బ్యాంక్ లో లోన్ తీసుకొని తిరిగి చెల్లించకుండా వున్న లబ్దిదారులను NPA (Non Performing Asset) లుగా గుర్తించి వారని ఈ పథకానికి పూర్తి అనర్హులుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. సంబందిత మండల అధికారులు ఈ అర్హుల జాబితాను జిల్లా అధికారులకు పంపించనున్నారు.

Rajiv Yuva Vikasam Scheme పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కలిగించేందుకు బ్యాంక్ ల ద్వారా వారికి లోన్ లు ఇప్పించి మరియు ట్రైనింగ్ అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం ద్వారా యువతకు చిన్న తరహా వ్యాపారాలు స్థాపించేందుకు గానూ రుణాలు అందించబడతాయి. ఈ పథకం ద్వారా 50 వేల నుండి 4 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు.

సిబిల్ స్కోర్ ఎందుకు అవసరం?

  • సిబిల్ స్కోర్ అనేది వ్యక్తి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఇవ్వబడే స్కోర్.
  • ఇది 300 నుండి 900 వరకు ఉంటుంది. 750కి పైగా స్కోర్ ఉన్నవారు ఎక్కువ విశ్వసనీయులుగా పరిగణించబడతారు.
  • Rajiv Yuva Vikasam పథకానికి అప్లై చేసిన యువత తమకు ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నదా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకునేందుకు ఈ స్కోర్ ఉపయోగపడుతుంది.

సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలి? How to Check CIBIL Score in Telugu

  1. ఈ క్రింద ఇవ్వబడిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
    CIBIL అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లండి.
  2. Get Your CIBIL Score” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. మీ వివరాలు నమోదు చేయండి:
    పేరు, పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ వంటి సమాచారం నమోదు చేయాలి.
  4. OTP ద్వారా వెరిఫికేషన్ ను పూర్తి చేయండి.
  5. స్కోర్ చూడండి:
    సక్సెస్‌ఫుల్ వెరిఫికేషన్ తరువాత మీరు మీ సిబిల్ స్కోర్‌ను పొందుతారు.

Rajiv Yuva Vikasam పథకానికి అప్లై చేయాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?

సాధారణంగా, 750 కి పైగా స్కోర్ ఉంటే మీకు రుణం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ, 650–750 మధ్య స్కోర్ ఉన్నవారికి కూడా రుణం మంజూరయ్యే అవకాశాలు ఉండవచ్చు, ఇతర ప్రమాణాలను బట్టి.

  • స్కోర్ చెక్ చేసే సమయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి.
  • సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఉచితం కాకపోవచ్చు – ఒకసారి ఉచిత స్కోర్ అందించబడుతుంది.
  • మీరు సరిగ్గా రుణాలు చెల్లించకపోతే స్కోర్ తగ్గే అవకాశం ఉంది. స్కోర్ తక్కువ వున్న లబ్దిదారులు ఈ పధకానికి అనర్హులు అవుతారు.

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మీరు ఆర్థిక సహాయం పొందాలనుకుంటే, మీ సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయండి. ఇది మీ నాణ్యతను నిరూపించే ప్రధాన ఆధారం. సక్రమంగా రుణ చెల్లింపులు చేస్తూ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అవుతారు.

Leave a Comment